ఏపీ మంత్రి నారా లోకేష్ అహ్మదాబాద్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో సందడి చేశారు. ఇండియా న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్‌ను ఎంజాయ్ చేశారు. ఈ క్రమంలోనే మంత్రిగా తాను స్టేడియానికి వెళ్లి చూసిన ఏ మ్యాచ్‌లో కూడా భారత క్రికెట్ జట్టు ఓడిపోలేదంటూ ఇంట్రస్టింగ్ ట్వీట్ చేశారు లోకేష్. ఈ విషయం గ్రోక్‌కు కూడా తెలుసంటూ ఆ వివరాలను పంచుకున్నారు.