భారత క్రికెట్ జట్టులో తెలుగు ప్లేయర్లు సత్తా చాటుతున్న ఈ సందర్భంలో.. మరో గుడ్ న్యూన్ వినిపించింది. ఐసీసీ మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ టోర్మమెంట్‌కు తెలుగు క్రికెటర్లు.. అందులోనూ తెలంగాణ ప్లేయర్లు సెలెక్ట్ అయ్యారు. త్రిష, ధృతి సెలెక్ట్ కాగా.. వారిద్దరినీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. వరల్డ్ కప్ టోర్నమెంట్ అయ్యాక.. వాళ్లిద్దరికీ నగదు నగరానా ప్రకటించనున్నట్టు హెచ్సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.