తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా మరో బస్సుల్లో ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రాత్రిపూట ప్రయాణించేవారికి రూ.100, పగటిపూట ప్రయాణించేవారికి రూ.50 చొప్పున ఛార్జీలు పెరిగాయి. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు ఈ పెరిగిన ఛార్జీలు వర్తించనున్నవి. ఇదివరకే బస్ పాస్ ఛార్జీలను పెంచిన ఆర్టీసీ, ఇప్పుడు పుష్పక్ బస్సుల్లోనూ పెంచడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ ధరల పెంపు గురించి ఆర్టీసీ నుంచి ఉలాంటి ప్రకటన లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.