ప్రయాణికుల చిల్లర సమస్యను పరిష్కరించడానికి ఆర్టీసీ బస్సుల్లో ఈ-టిమ్ యంత్రాలను ప్రవేశపెట్టింది. ఈ యంత్రాల ద్వారా ప్రయాణికులు ఫోన్ పే, గూగుల్ పే, స్వైపింగ్ కార్డులతో టికెట్ కొనుగోలు చేయగలరు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖని, మంథని డిపోలలో ఈ యంత్రాలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. కండక్టర్ల ఒత్తిడిని తగ్గిస్తూ, ప్రయాణికుల అనుభవాన్ని సౌకర్యవంతంగా మార్చడంలో ఈ యంత్రాలు ఉపయోగపడనున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.