టీటీడీ బోర్డు సభ్యుడు, ఉద్యోగుల మధ్య నెలకొన్న వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. టీటీడీ ఉద్యోగి బాలాజీ సింగ్‌కు బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ క్షమాపణలు తెలిపారు. దీంతో వివాదానికి తెరపడింది. ఆందోళనలు విరమిస్తున్నట్లు టీటీడీ ఉద్యోగులు వెల్లడించారు. మరోవైపు మూడు రోజుల కిందట టీటీడీ ఉద్యోగి బాలాజీ సింగ్‌పై నరేష్ కుమార్ దురుసుగా ప్రవర్తించారు. దీంతో క్షమాపణలు చెప్పాలంటూ టీటీడీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. అయితే టీటీడీ ఈవో జోక్యంతో వివాదానికి ఎండ్ కార్డ్ పడింది.