తిరుపతిలో టీటీడీ పరిపాలనా భవనం ఎదుట టీటీడీ ఉద్యోగుల ధర్నాకు దిగారు. ఉద్యోగిని దూషించిన బోర్డు సభ్యుడు నరేష్‌కుమార్‌ని తొలగించాలంటూ డిమాండ్ చేశారు. టీటీడీ ఉద్యోగులకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు చేశారు. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ ఉద్యోగుల డిమాండ్ చేశారు. అనంతరం శాంతియుతంగా ర్యాలీ చేశారు.