TTD Employees Donation to CM Relief Fund: వరద బాధితుల కోసం విరాళాలు కొనసాగుతున్నాయి. వరద బాధితుల సహాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి టీటీడీ ఉద్యోగులు, పెన్షనర్లు భారీ విరాళం అందించారు. టీటీడీ ఉద్యోగులు రూ.1.19 కోట్లు, టీటీడీలో పనిచేసి రిటైర్ అయిన పెన్షనర్లు రూ.71.59 లక్షలు విరాళం అందించారు. విరాళం తాలూకు చెక్కును సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతికి అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు వారిని అభినందించారు. అనంతరం నూతన కేలండర్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు.