టీటీడీ ఉద్యోగులతో కలిసి క్రికెట్ ఆడిన తమన్, అశ్విన్‌బాబు

5 hours ago 1
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన హీరో అశ్విన్ బాబు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ టీటీడీ ఉద్యోగులతో కలిసి క్రికెట్ ఆడారు. తిరుపతిలోని ఎస్వీ హైస్కూల్ మైదానంలో మ్యాచ్ ఆడుతూ సందడి చేశారు. తమన్ పేరుతో ఉన్న టీటీడీ ఉద్యోగుల జెర్సీని వేసుకున్న హీరో అశ్విన్ బాబు.. అడిగిన వారికి కాదనకుండా సెల్ఫీలు ఇచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ బౌలింగ్ చేసి అలరించారు. అంతకముందు తిరుమల శ్రీవారిని సినీ సంగీత దర్శకుడు తమన్, దర్శకుడు గోపీచంద్ మలినేని, నటుడు అశ్విన్ బాబు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో వారు పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
Read Entire Article