తిరుమల శ్రీవార సేవకుల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వృత్తి నిపుణులైన శ్రీవారి సేవకుల కోసం ప్రత్యేక యాప్ రూపొందించాలని నిర్ణయించారు. నెల రోజుల్లో అప్లికేషన్ అందుబాటులోకి తీసుకువచ్చే పనిలో ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వృత్తి నిపుణులను శ్రీవారి సేవకు వినియోగించుకోవాలని టీటీడీ నిర్ణయించింది. మరోవైపు శ్రీనివాసమంగాపురంలో సాక్షాత్కార వైభవోత్సవాలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి.