TTD Suspends Four Employees: తిరుమల తిరుపతి దేవస్థానం నలుగురు అన్యమత ఉద్యోగులను సస్పెండ్ చేసింది. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలిజర్, స్టాఫ్ నర్స్ రోసి, ఫార్మసిస్ట్ ప్రేమవతి, డాక్టర్ అసుంత క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. సంస్థ నియమావళిని ఉల్లంఘించారని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని టీటీడీ పేర్కొంది. ఇదిలా ఉండగా, టీటీడీ ఈవో పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ ఖాతా తెరిచి డబ్బులు అడుగుతున్న మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీటీడీ హెచ్చరించింది.