తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి.. రాయలసీమ వాసులకు అత్యాధునిక వైద్యం అందిస్తున్న ఆస్పత్రి. 2021లో స్విమ్స్ ఆస్పత్రిని టీటీడీ నియంత్రణలోకి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో స్విమ్స్ ఆస్పత్రి అభివృద్ధిపై తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టిపెట్టింది. స్విమ్స్ ఆస్పత్రిలో మెరుగైన వైద్య సౌకర్యాలు, మౌలిక వసతుల కల్పన, మరింత మెరుగైన వైద్యం అందించేందుకు టీటీడీ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ నిపుణుల కమిటీ తాజాగా నివేదిక సమర్పించింది.