టీటీడీకి మరో భారీ విరాళం అందింది. ముంబైకి చెందిన ఛారిటీ ట్రస్టు.. టీటీడీలోని శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్‌కు 50 లక్షల రూపాయలు విరాళంగా అందజేసింది. టీటీడీ ఈవో శ్యామలరావును కలిసిన జీన్ అండ్ బొమాని ట్రస్టు ప్రతినిధి విరాళం తాలూకు చెక్ అందజేశారు. మరోవైపు ఈ సంస్థ ఇప్పటికే స్విమ్స్‌కు ఏడు కోట్ల రూపాయల వరకూ విరాళం అందించినట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి. అటు తిరుచానూరులో పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.