తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారీగా లబ్ధి చెందింది ఆంధ్రా వాళ్లే అన్నారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత శ్రీనివాస్ గౌడ్. ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దేవుడు ముందు అందర్ని సమానంగా చూడాలని.. తెలంగాణ ప్రజలు, ప్రజాప్రతినిధుల పట్ల టీటీడీ వివక్ష చూపుతోందన్నారు..ఇది మంచి పరిణామం కాదన్నారు. తెలంగాణలో వ్యాపారాలు చేస్తూ లబ్ధి పొందుతున్నది ఆంధ్రా వాళ్లే..పదవుల్లో లబ్ధి పొందుతున్నది వారేనన్నారు. తెలంగాణ ప్రజల పట్ల వివక్ష చూపితే.. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఆంధ్రా వారికీ ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధులకు గతంలో కల్పిస్తున్న సౌకర్యాలను కూటమి ప్రభుత్వం పునరుద్ధరించాలని కోరారు. టీటీడీ చైర్మన్‌కి పూర్తి స్వేచ్చ ఇస్తే..తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు శ్రీనివాస్ గౌడ్.