TTD Notice To It Wing Sandeep Reddy: టీటీడీలో నోటీసుల వ్యవహారం సంచలనంగా మారింది. ఐటీ విభాగంలో జీఎంగా పనిచేసిన సందీప్ రెడ్డికి టీటీడీ నోటీసులు జారీ చేసింది. వారంలోగా విద్యార్హతలు, పూర్వ అనుభవం, టీటీడీకి ఎంపికైన విధానంపై సంజాయిషీ కోరింది. ఈ మేరకు ఈ నెల 4న నోటీసులు జారీ చేయగా.. ఈ విషయం ఆలస్యంగా బయటపడింది. సందీప్ రెడ్డిని టీటీడీలో మొదటి సైబర్ సెక్యూరిటీ నిపుణుడిగా నియమించారు.