టీడీపీ ఆఫీసుపై దాడి కేసు సోమవారం కీలక ట్విస్ట్ తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పానుగంటి చైతన్య మంగళగిరిలోని కోర్టు ఎదుట లొంగిపోయారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత అజ్ఞాతంలో ఉన్న పానుగంటి చైతన్య.. ఈరోజు అనూహ్యంగా కోర్టు ముందు లొంగిపోయారు. తనకు బెయిల్ ఇవ్వాలంటూ కోర్టును కోరారు. అయితే ఇన్నిరోజుల తర్వాత కేసులో కీలకంగా ఉన్న పానుగంటి చైతన్య బయటకు రావటంతో టీడీపీ ఆఫీసుపై దాడి కేసు కీలక మలుపు తిరిగే అవకాశాలు ఉన్నాయి.