ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరో మూడు రోజుల్లో వంద రోజులు పూర్తికానుంది. ఈ నేపథ్యంలో వంద రోజుల పాలన గురించి, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు గురించి నియోజకవర్గ ప్రజల నుంచి అభిప్రాయాలను తెలుసుకోవాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఈ నెల 20 నుంచి 26 వరకూ ఎమ్యెల్యేలు, మంత్రులు నియోజకవర్గంలో పర్యటించాలని.. క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. అలాగే బుధవారం ( సెప్టెంబర్ 18) కూటమి ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ కానున్నారు.