Police Case On Edupuganti Srinivas Babu: ఏలూరులో చింతమనేని వర్సెస్ ఈడ్పుగంటి శ్రీనివాసబాబు ఎపిసోడ్ కీలక మలుపు తిరిగింది. తాజాగా శ్రీనివాసబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే చంటి ప్రకటించారు. ఎమ్మెల్యే చింతమనేని, ఆయన కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలు దారుణమన్నారు. అందుకే ఆయన్ను సస్పెండ్ చేశామన్నారు. గతంలో కూడా ఆయన్ను పిలిపించి మాట్లాడామని.. పద్ధతి మార్చుకోకపోవడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశామన్నారు.