టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా.. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై స్పందించారు. 2024 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోవటంతో ఈసారి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో దేవినేని ఉమాకు అవకాశం దక్కుతుందని ప్రచారం జరిగింది. అయితే ఊహించని విధంగా టీడీపీ అధినేత చంద్రబాబు సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇచ్చారు. కావలి గ్రీష్మ, బీటీ నాయుడు, బీద రవిచంద్ర యాదవ్‌లను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో దేవినేని రియాక్షన్ ప్రాధాన్యం సంతరించుకుంది.