Veeraiah Chowdary Murder Case Accused Arrested: టీడీపీ నేత, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి హత్య కేసును పోలీసులు ఛేదించారు. రాజకీయ కక్షలు, ఇసుక వ్యాపారంలో విభేదాలే హత్యకు కారణమని తేల్చారు. ఆళ్ల సాంబయ్య అలియాస్ సిద్ధాంతి అనే వ్యక్తి కిరాయి హంతకులతో ఈ హత్య చేయించాడని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో 9 మంది నిందితులను అరెస్టు చేశారు. అమ్మనబ్రోలు గ్రామంలో ఆధిపత్య పోరే హత్యకు ప్రధాన కారణమని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇంకా అనేక విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది.