Abdul Aziz Andhra Pradesh Waqf Board Chairman: టీడీపీ సీనియర్ నేతలకు కీలక పదవి దక్కింది.. ఎన్నికల్లో సీటు రాకపోయినా.. ఇప్పుడు చంద్రబాబు ప్రమోషన్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా నెల్లూరుకు చెందిన సీనియర్ నేత అబ్దుల్ అజీజ్‌ను ఎన్నుకున్నారు. ఇటీవల ప్రభుత్వం నియమించిన వక్ఫ్ బోర్డు సభ్యుల తొలి సమావేశం విజయవాడలో జరగ్గా.. అబ్దుల్ అజీజ్‌ను చైర్మన్‌గా సభ్యులంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు ఆయన బాధ్యతల్ని కూడా స్వీకరించారు.