Pendurthi Venkatesh Appointed As Cm Program Coordinator: ఆంధ్రప్రదేశ్‌లో మరో కీలక పదవిని భర్తీ చేశారు.. ఈ మేరకు ప్రభుత్వం ఉతర్త్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్‌గా మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ నియమితులయ్యారు. ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఎం చంద్రబాబు కార్యక్రమాల నిర్వహణ వ్యవహారాలను పెందుర్తి వెంకటేష్ పర్యవేక్షిస్తారు. వెంకటేష్ గతంలో తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2009, 2014 ఎన్నికల్లో విజయం సాధించారు.