Ex Minister Ks Jawahar House Theft: టీడీపీ మాజీ మంత్రి కె.ఎస్.జవహర్ ఇంట్లో దొంగలు పడ్డారు. ప్రధాని మోదీ సభకు ఇంఛార్జ్‌గా జవహర్ గుడివాడ వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దొంగలు చోరీకి పాల్పడ్డారు. నగదు, బంగారు ఉంగరాలు, మొబైల్స్, వెండి వస్తువులు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన కొవ్వూరులో కలకలం రేపింది.