Jogi Ramesh In Tdp Rally: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి పాల్గొన్నారు. ఆయన ఏపీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యేతో కలిసి ర్యాలీగా వెళ్లారు. నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా నూజివీడులో ర్యాలీ చేయగా.. మాజీ మంత్రి జోగ రమేష్ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి పాల్గొన్నారు.