టీడీపీ, వైసీపీ కాదు.. ఏపీకి మూడో ప్రత్యామ్నాయం కావాలి.. విజయసాయిరెడ్డి ట్వీట్ అర్థం అదేనా!

4 months ago 18
ఏపీ రాజకీయాలపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇంట్రస్టింగ్ ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రెండు విపరీత ధోరణుల మధ్య చిక్కుకుపోయాయన్న విజయసాయిరెడ్డి.. ఏపీకి ఇప్పుడు నమ్మకమైన మూడో ప్రత్యామ్నాయం అవసరం ఉందంటూ ట్వీట్ చేశారు. సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో తీసుకెళ్లే నమ్మకమైన మూడో ప్రత్యా్మ్నాయం కావాలని పేర్కొన్నారు. మరోవైపు జూలై నెలలో రాజకీయాల్లోకి మళ్లీ వస్తానని విజయసాయిరెడ్డి ఇటీవల ప్రకటించారు. అలాగే ఏపీలో కొత్త పార్టీ అవసరం ఉందని కూడా అన్నారు . ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ పెట్ట ఆలోచన చేస్తున్నారా అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో మొదలయ్యాయి.
Read Entire Article