Chandrababu On Tdp Formation Day: తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో అట్టహాసంగా వేడుకలు నిర్వహించనున్నారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించి, వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలిఘటించి ఆవిర్భావ సభకు హాజరయ్యారు. 60వేల మంది టీడీపీ కార్యకర్తలు, నేతలతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పార్టీకి కార్యకర్తలే శ్రీరామరక్ష అన్నారు.