TDP Rs 25 Lakhs Donation: తోలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి కోసం భారీ విరాళం అందించారు. జనచైతన్య శ్రేష్ఠ గ్రూప్స్ అధినేత మాదల చైతన్య మంచి మనసుతో విరాళం అందజేశారు. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్‌ను మాదల చైతన్య కలిసి చెక్కును అందజేశారు. చైతన్య కార్యకర్తల సంక్షేమ నిధి కోసం రూ.25 లక్షల విరాళం అందించారు. టీడీపీ కార్యకర్తలను అన్ని విధాలుగా ఆదుకుంటున్న ఏకైక పార్టీ అన్నారు. ప్రతిపైసా కార్యకర్తల సంక్షేమానికి దోహదపడుతుంది అన్నారు.