Proddatur Councilors Re Joined In Ysrcp: కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాల్టీలో టీడీపీకి గట్టి షాక్. కూటమి అధికారంలోకి రావడంతో వైసీపీకి చెందిన కొందరు కౌన్సిలర్లు ఎమ్మెల్యే ఎన్.వరదరాజులరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. అలా చేరిన ముగ్గురు కౌన్సిలర్లు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి సమక్షంలో 8, 39, 40వ వార్డుల కౌన్సిలర్లు రాగుల శాంతి, రావులకొల్లు అరుణ, చింపిరి అనిల్‌కుమార్ చేరడం విశేషం.