హైదరాబాద్‌లో పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచేందుకు కొత్వాల్‌గూడ ఎకో పార్కు సిద్ధమైంది. హిమాయత్‌సాగర్ సమీపంలో అంతర్జాతీయ పక్షి కేంద్రం త్వరలో ప్రారంభం కానుంది. అమెజాన్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా వంటి ప్రాంతాల నుంచి అరుదైన, రంగురంగుల పక్షులు ఇక్కడ సందర్శకులను అలరించనున్నాయి. ప్రకృతి ప్రేమికులకు, పక్షుల ప్రపంచాన్ని దగ్గరగా చూసేవారికి ఇది ఒక అద్భుతమైన వేదిక కానుంది.