తిరుపతిలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో నిర్వహించే ఎస్వీ గోశాలలో వందలాది గోవులు మృతిచెందాయంటూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. దీనిపై అధికారం పక్షం కౌంటర్ ఎటాక్ చేసింది. టీటీడీ కూడా ఇది తప్పుడు ప్రచారం.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వీడియోలు అసలు టీటీడీ గోశాలకు సంబంధించినవి కావు అంటూ క్లారిటీ ఇచ్చింది. ఈ వ్యవహారం ఇంకా ముదురుతోది.