జాతీయ. అంతర్జాతీయ పరిశ్రమలను ఆకర్షించేందుకు తీవ్రంగా కృషిచేస్తున్న ఏపీ ప్రభుత్వం.. మరో కీలకమైన ప్రాజెక్టుపైనా ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా.. భారతదేశంలో ప్లాంట్ ఏర్పాటు కోసం ఎప్పటి నుంచి మరో ప్రయత్నాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో, ఎలాన్ మస్క్ భేటీ కావటంతో ఈ ప్లాంట్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే టెస్లా ప్లాంట్ కోసం ఏపీ కూడా రేసులోకి వచ్చిందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.