సీనియర్ ఐఏఎస్ బుర్రా వెంకటేశంను TGPSC ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే వ్యక్తిత్వం కలిగిన వెంకటేశం నిరుపేద కుటుంబంలో జన్మించి అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. కష్టాలను అధిగమించి, కన్నీళ్లను దిగమింగి అనుకున్నది సాధించారు. తల్లిదండ్రుల ఆశయాలు, గురువు చూపిన మార్గంలో నడిచి తిరుగులేని విజయాలు సాధించిన ఆయన ప్రయాణం ఎందిరికో స్పూర్తి.