Chandrababu Naidu Donald Trump AI Generated Video Viral: ప్రస్తుతం ఏఐ టూల్స్ హవా నడుస్తోంది. తాజాగా ఏఐ సాయంతో రూపొందించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా స్వాగతం పలుకుతారు అనే దానిపై ఈ వీడియో రూపొందించబడింది. చంద్రబాబు, ట్రంప్ కలిసి విశాఖ బీచ్‌లో కొబ్బరి బొండాలు తాగుతూ, సైకిల్ తొక్కుతూ సందడి చేస్తున్నట్లు వీడియోలో ఉంది. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.