అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం కారణంగా ఏపీలోని ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా రొయ్యలు సాగుచేసే రైతులు ధరలు తగ్గి ఇబ్బందులు పడుతున్నారు. రొయ్యలపై దిగుమతి సుంకాన్ని అమెరికా పెంచబోతోందంటూ వార్తలు వచ్చాయి. దీంతో ఏపీలో రొయ్యల కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఫలితంగా ధరలు తగ్గుతున్నాయి. దీంతో రొయ్యల పెంపకం చేపట్టిన రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.