సమాజంలో ట్రాన్స్‌జెండర్లకు గౌరవప్రదమైన జీవనోపాధి కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ట్రాన్స్‌జెండర్లకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఆటోలను పంపిణీ చేస్తున్నారు. రాయితీ మీద సీఎన్‌జీ ఆటోలను అందిస్తున్నారు. విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి ట్రాన్స్‌జెండర్లకు ఆటోలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు కార్డులు, రేషన్ కార్డులు అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.