తెలంగాణలో ఉన్న ట్రాన్స్ జెండర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఇప్పటివరకు.. ట్రాన్స్ జెండర్లు ఏ రకంగానైనా అనారోగ్యానికి గురైనా.. వాళ్లు ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేయించుకునేందుకు ఇబ్బందిపడేవారు. అయితే.. ఆ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం.. ట్రాన్స్ జెండర్ల కోసం ప్రత్యేకంగా మైత్రి క్లినిక్ అని ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించాలని నిర్ణయించింది. ఈ మైత్రి క్లినిక్‌లు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది.