తెలంగాణలో ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే చలాన్లతో పాటు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. వాహనం రోడ్డుపైకి వచ్చిన తర్వాత ఎప్పుడు, ఎక్కడి నుంచి ప్రమాదం ఎదురవుతుందో ఎవరూ ఊహించలేరు. మనం జాగ్రత్తగా నడిపినా.. ఎదుటి వ్యక్తి అజాగ్రత్తగా నడిపితే ప్రమాదం తప్పదు. ఇలాంటి సంఘటనల్లో ప్రాణనష్టం, ఆస్తినష్టం జరుగుతుంది. అయినప్పటికీ కొంతమంది నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా, ట్రాఫిక్ చలాన్ల నుండి తప్పించుకోవడానికి నంబర్ ప్లేట్‌లను మార్చి మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ట్రిక్స్ వాడటం చట్టవిరుద్ధం మాత్రమే కాకుండా... పట్టుబడితే కఠిన చర్యలు తప్పవు.