ట్రాఫిక్ పోలీసులకు గుడ్ న్యూస్.. డీజీపీ కీలక ఆదేశాలు

3 hours ago 2
ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు మండిపోతున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు రోజురోజుకూ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులకు ఏపీ డీజీపీ తీపికబురు వినిపించారు. ఎండలో విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీసులకు రక్షణ కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ పోలీసుల ఆరోగ్య భద్రత కోసం రూ.48 లక్షల నిధులను కేటాయించారు. ఈ నిధులతో రాష్ట్రంలోని 3,192 మంది ట్రాఫిక్ పోలీసులకు ఎండల నుంచి రక్షణ కల్పించేలా వైట్ టోపీలు, యూవీ ప్రొటెక్షన్ గాగుల్స్, ఫేస్ మాస్కులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్ అందించనున్నారు. ఎండలు, వేడిగాలుల కారణంగా ట్రాఫిక్ పోలీసులలో డీహైడ్రేషన్, వడ దెబ్బ వంటి సమస్యలు తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Entire Article