సంక్రాంతి పండుగ వేళ జనం సొంతూళ్లకు వెళ్తుండటంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. రైల్వే స్టేషన్‌లోనూ జనం పట్టాలపై రైళ్ల కోసం నిరీక్షించడం గమనార్హం. ప్రయాణికులతో రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చే రైళ్లు రద్దీగా ఉన్నాయి. సాధారణ రిజర్వేషన్లు నాలుగు నెలల కిందటే అయిపోగా.. తత్కాల్, ప్రీమియం తత్కాల్ టిక్కెట్ల కోసం ఎక్కువ మంది ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రావెల్స్ బస్సులు ఇదే అదునుగా దోపిడీకి పాల్పడుతున్నాయి.