విజయవాడ-సికింద్రాబాద్ మధ్య నడిచే శాతవాహన ఎక్స్‌ప్రెస్ ఇకపై జనగామలో ఆగనుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి ఈ కొత్త హాల్ట్ అమల్లోకి వస్తుంది. దీంతో జనగామ ప్రజల చిరకాల కోరిక నెరవేరనుంది. ఈ మార్పుతో సికింద్రాబాద్-కాజీపేట మధ్య ప్రయాణించే వారికి మెరుగైన కనెక్టివిటీ లభించనుంది.