రైల్వే అధికారులు ట్రైన్ ప్రయాణికులకు న్యూ ఇయర్ సందర్భంగా గుడ్‌న్యూస్ చెప్పారు. ట్రైన్లలో జనరల్ బోగీల సంఖ్యను పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లలోనూ జనరల్ బోగీల సంఖ్యను పెంచుతున్నామని చెప్పారు. ప్రస్తుతం రెండు బోగీలను నాలుగు బోగీలకు పెంచనున్నట్లు ప్రకటన విడుదల చేశారు.