నర్సీపట్నం జాతరలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఓ వ్యక్తిపై చేయి చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. డప్పు కొడుతున్న వ్యక్తిపై అయ్యన్నపాత్రుడు చేయి చేసుకున్నారంటూ వీడియో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో వీడియోలోని వ్యక్తి స్పందించారు. ఈ ఘటనను రాజకీయం చేయవద్దని కోరారు. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.