డిక్కీలో రూ.1.91 లక్షల క్యాష్.. దగ్ధమైన ఎలక్ట్రిక్ స్కూటీ

3 months ago 6
ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటీ పేలిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. జగిత్యాల రూరల్ మండంలలోని బాలపల్లి గ్రామానికి చెందిన తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఇటీవల ఓ ఎలక్ట్రిక్ స్కూటీని కొనుగోలు చేశాడు. గురువారం ఉదయం ఇంటి ఆవరణలో స్కూటీకి ఛార్జింగ్ పెట్టాడు. అయితే కాసేపటికే బ్యాటరీ పేలడంతో స్కూటీ దగ్ధమైంది. ఇటీవలే ధాన్యం విక్రయించిన తిరుపతి రెడ్డి.. వచ్చిన నగదు రూ.1.91 లక్షలు కూడా స్కూటీ డిక్కీలోనే ఉన్నాయని.. నగదు మొత్తం కాలిపోయిందని.. ఇంటి దర్వాజా కూడా కాలిపోయిందని తిరుపతి రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
Read Entire Article