తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం కొత్త విద్యా విధానాన్ని ప్రవేశపెడుతోంది. ఇందులో టెక్నాలజీ పేపర్లు, ఇంగ్లిష్ కమ్యూనికేషన్, ఇంటర్న్‌షిప్‌లు తప్పనిసరి చేస్తుంది. 2025-26 విద్యా సంవత్సరంలో ఈ విధానాన్ని అమలు చేసే యోచనలో ఉంది. పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రెండు నెలలుగా ఉన్నత విద్యామండలి సిలబస్‌లో మార్పులను పరిశీలిస్తూ.. ఈ ప్రణాళికను సాధించడానికి కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.