బాపట్ల జిల్లా పోలీసులు సైబర్ కేటుగాళ్ల ఆటకట్టించారు. డిజిటల్ అరెస్టు పేరుతో ప్రజలను భయపెట్టి వారి నుంచి లక్షల రూపాయలు కాజేస్తున్న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన అంతర్రాష్ట్ర సైబర్ మోసగాళ్లు రమేష్, శ్రవణ్‌కుమార్‌లను అరెస్టు చేసినట్లు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. రిటైర్డ్ ప్రొఫెసర్‌ను డిజిటల్ అరెస్టు పేరుతో భయపెట్టి, 74 లక్షల రూపాయలు వసూలు చేసిన కేసులో వీరిద్దర్ని రాజస్థాన్‌లో అరెస్టు చేసి, బాపట్ల తీసుకొచ్చామని వెల్లడించారు. ఈ తరహా మోసంలో నిందితులను అరెస్టు చేయడం దేశంలోనే ఇదే తొలిసారి అని చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్లకు ఈ కేసు వివరాలు వెల్లడించారు.