గ్రంథాలయాలు కూడా అప్డేట్ అవుతున్నాయి. ఇకపై మనం ఆన్‌లైన్‌లోనే మనకు నచ్చిన పుస్తకం చదువుకోవచ్చు. మారుతున్న కాలానికి తగ్గట్టు గ్రంథాలయ శాఖ కూడా డిజిటల్ బాట పట్టింది. ప్రతి గ్రంథాలయం వద్ద ప్రత్యేక క్యూ ఆర్ కోడ్ ఏర్పాటు చేశారు.. దాన్ని స్కాన్ చేస్తే నచ్చిన పుస్తకాన్ని చదువుకునే అవకాశం ఉంది. ఏ గ్రంథాలయంలో ఎలాంటి పుస్తకాలు ఉన్నాయి.. ఒకవేళ తనకు కావాల్సిన పుస్తకం అక్కడ లేకపోతే జిల్లాలోని ఏ గ్రంథాలయంలో ఉందో కూడా తెలుసుకోవచ్చు.