డిజిటల్ మార్కెటింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న సంస్థపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఒకేసారి 3 రాష్ట్రాల్లో ఆ సంస్థ కార్యాలయాల్లో దాడులు చేసి.. ఏకంగా 32 మందిని అరెస్ట్ చేశారు. భారీగా పత్రాలు, ల్యాప్‌టాప్‌లు, ఇతర కీలక వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంస్థ.. పలు రాష్ట్రాల్లో వందలాది మందిని మోసం చేసి.. వేల కోట్ల రూపాయలను కూడబెట్టినట్లు పోలీసులు వెల్లడించారు.