తెలంగాణలో పోలీస్, ఫైర్, జైళ్లు, ఎస్‌పీఎఫ్, ఎక్సైజ్, ట్రాన్స్‌పోర్ట్, ఫారెస్ట్ శాఖల యూనిఫామ్ సర్వీసు ఉద్యోగార్థులకు ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని ఇప్పటికే ఉన్న ఐదేళ్ల సడలింపునకు అదనంగా మరో రెండేళ్లు పెంచింది. దీంతో మొత్తం ఏడేళ్ల వరకు వయోపరిమితి సడలింపు వర్తించనుంది. మరోవైపు 7,437 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేయాలి.