డీజీపీ, ఐజీల సదస్సుకు తిరుపతి వేదిక కానుంది. ఈ మీటింగ్ డిసెంబర్ 4వ తేదీ నుంచి 6వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరగనుంది. ఈ సమావేశం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) ప్రాంగణంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా కూడా హాజరవుతారు. దీంతో ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే ఎలాంటి చిన్న పొరపాట్లు జరగక్కుండా చూడాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశించింది.