ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల కృష్ణా జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా పర్యటనలో అపశ్రుతి జరిగిందంటూ వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్‌ను చూడ్డానికి జనం భారీగా తరలిరాగా.. తోపులాట జరిగిందని.. ఓ బాలికకు గాయాలయ్యాయంటూ వార్తలు, వీడియోలు వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ పోస్టులు, వీడియోలో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం.