హైదరాబాద్ నగరాన్ని పర్యావరణహితంగా, కాలుష్యరహితంగా మార్చేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే.. ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్న రేవంత్ రెడ్డి సర్కార్.. ఇప్పుడు ఆటోల విషయంలోనూ కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. నగరంలో నడుస్తున్న డీజిల్ ఆటోలను ఔటర్ రింగు రోడ్డు అవతలికి పంపించాలని.. ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేసేందుకు ప్రత్యేక రాయితీలతో ఓ పథకాన్ని తీసుకురావాలని రవాణా శాఖకు రేవంత్ రెడ్డి సూచించారు.